శ్రీ మహావిష్ణువు యొక్క ముఖపద్మమే అగ్నిభగవానుడు.
యజ్ఞముల ద్వారా, అగ్నికార్యముల ద్వారా పరమాత్మతో మనలను అనుసంధానం చేస్తాడు పంచభూతదివ్యస్వరూపుడు అగ్నిభగవానుడు.
ఆ అగ్నిభగవానుని ద్వారా వశిష్ఠునికి చెప్పబడి వేదవ్యాసునిచే లోకానికి అందించబడినది ఈ అగ్నిపురాణం. సంక్షిప్తంగా నవాహ (9 రోజుల) పారాయణమునకు వీలుగా అభినవశుక, ప్రవచననిధి పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు, వారి దివ్యాశీస్సులతో తమ శిష్యులచే సంకలనం చేయించిన ఈ గ్రంధాన్ని భక్తిశ్రద్ధలతో పారాయణ చేసినవారికి సమస్త వాస్తుదోషాలు, శత్రుపీడలు తొలగి, భయంకర కష్టాల్లోంచి బయటపడతారు. పుష్కరంలో స్నానం చేసి నూరు కపిలగోవులను దానం చేసిన మహాఫలితం పొందుతారు.





