పంథొమ్మిది వ్యాసాలు ఉన్నఈ సంపుటి లో “చైత్రం” మొదలుకుని “ఫాల్గుణం” వరకు గల పన్నెండు మాసాలు ప్రాముఖ్యత, ఆయా మాసాలతో ముడిపడియున్న అనాకానేక ముఖ్య అంశాలు విశదీకరించబడ్డాయి.
ఈ గ్రంథంలో జ్యోతిర్లింగాల ఆవిర్భావ ఘట్టములు, క్షేత్రప్రశస్తి, పౌరాణిక గాధలు, మహిమలు సవివరముగా, సహేతుకంగా, సమగ్రంగా ఫలశ్రుతులతో పాటుగా ఏ జ్యోతిర్లింగాన్ని ఏ సమయంలో ఏ రీతిన అర్చించాలి, ఏ ఏ మాసాలలో, ఏ ఏ తిథులలో అర్చిస్తే సత్ఫలితాలు లభిస్తాయి వంటి అనేక విషయాలు రమణీయంగా ఆవిష్కరింప బడ్డాయి. శివ మహిమల పై సంపూర్ణ అవగాహన పొంది తద్వారా పరమేశ్వరుని అనుగ్రహమునకు పాత్రులు కాదలచిన వారందరు చదివి తీరవలసిన గ్రంథం.




